News August 15, 2025

త్రివర్ణ శోభతో ముస్తాబైన కామారెడ్డి కలెక్టరేట్

image

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ త్రివర్ణ రంగుల విద్యుత్ కాంతులతో చూపరులను ఆకట్టుకుంటుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల విద్యుత్ కాంతులతో కలెక్టరేట్ భవనాన్ని ముస్తాబు చేశారు. రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ ఛైర్మన్ కోదండ రెడ్డి పాల్గొననున్నారు.

Similar News

News March 15, 2026

వనపర్తి: పీఆర్సీని అమలు చేయాలి: తపస్

image

ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని తపస్ వనపర్తి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ, శశివర్ధన్‌లు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆదివారం MLA మేఘారెడ్డికి ఆయన నివాసంలో యూనియన్ ఆధ్వర్యంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. పీఆర్సీ పైన ప్రభుత్వం వెంటనే స్పందించేలా చూడాలని, అలాగే పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరప్రసాద్ గౌడ్, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

News March 15, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖాధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News March 15, 2026

మంచిర్యాల: అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు

image

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, కనీస మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.