News October 7, 2024
త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం: ఎమ్మెల్యే తాటిపర్తి

ఇసుక ధరలపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విటర్(X) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘త్వరపడండి.. ఆలోచిస్తే.. ఆశాభంగం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో చంద్రబాబు ఉచిత ఇసుక ధర (18 టన్నులు) రూ.43,200 మాత్రమే. షరతులు వర్తిస్తాయి,’ అంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారాలోకేశ్‌లను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ ఉచిత ఇసుక అనేది బూటకపు మాటలని ఆదివారం పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
News December 5, 2025
ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.
News December 5, 2025
కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.


