News August 22, 2025
త్వరలోనే ఎన్నికలు.. సిద్ధంగా ఉండండి: మంత్రి పొంగులేటి

స్థానిక సంస్థల ఎన్నికలు అతి కొద్ది రోజుల్లోనే రావచ్చని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే సర్దుకుపోవాలన్నారు. త్వరలో పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
అల్లూరి: నత్తనడకన ఫ్యామిలీ సర్వే..ఆగ్రహించిన జడ్సీ సీఈవో

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జిల్లాలో నత్తనడకన సాగడంపై జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి కుమార్‌తో కలసి బుధవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల్లోని వివరాలను చూశారు. నిర్దేశించిన 38 ప్రశ్నలను అడిగి వివరాలతో పాటు కొత్త మార్పులను అప్డేట్ చేయాలన్నారు.
News January 21, 2026
హన్మకొండ: విడుదలైన ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ ఫలితాలు

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ 3, 5వ సెమిస్టర్ ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొ.రామచంద్రం బుధవారం విడుదల చేశారు. 3వ సెమిస్టర్‌లో 49%(448 మంది), 5వ సెమిస్టర్‌లో 68%తో మొత్తం 57.73% ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి తెలిపారు. మూల్యాంకనం నాణ్యతతో పారదర్శకంగా జరిగిందన్నారు. పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.రాజేందర్, వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, శ్రీలత, సుధీర్ పాల్గొన్నారు.
News January 21, 2026
నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై సంబంధిత శాఖ అధికారులు తరచూ తనిఖీలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న స్కానింగ్ సెంటర్ల విషయంలో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని సూచించారు.


