News February 16, 2025

త్వరలోనే నాగర్‌కర్నూల్‌కు రైల్వే లైన్: కేంద్రమంత్రి 

image

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బీజేపీ నాయకుడు భరత్ ప్రసాద్ ఇవాళ ఢిల్లీలో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు సంబంధించిన పలు అంశాల గురించి కేంద్రమంత్రికి వివరించినట్లు భరత్ ప్రసాద్ తెలిపారు. త్వరలోనే నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌కు రైల్వే లైన్ వస్తుందన్నారు.

Similar News

News March 6, 2026

కొత్తపట్నంలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం తుఫాన్ బిల్డింగ్ వద్ద శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతుడు పెదగంజం గ్రామానికి చెందిన పాలేటి గోపి (29)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక SI వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని SI తెలిపారు.

News March 6, 2026

స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 6, 2026

BREAKING ఖమ్మం: భార్యకు నిప్పంటించి భర్త ఆత్మహత్య

image

తిరుమలాయపాలెంలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తోటమల్ల నాగభూషణం తన భార్య జయమ్మ నిద్రిస్తుండగా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగభూషణం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన జయమ్మను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.