News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.

Similar News

News December 8, 2025

కృష్ణా జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ టెట్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేయాలన్నారు.

News December 8, 2025

మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

News December 8, 2025

గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

image

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.