News December 4, 2024
త్వరలో నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733217301577_19356415-normal-WIFI.webp)
త్వరలో నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈసందర్భంగా మంగళవారం నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో హెలిప్యాడ్ స్థలాన్ని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎల్. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ఎల్. వెంకటేశ్వర రావు, ఆర్ఐ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 19, 2025
పెరిగిన యాదగిరీశుడి నిత్య ఆదాయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737216220080_50308805-normal-WIFI.webp)
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం 1500 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.75,000, ప్రసాద విక్రయాలు రూ.12,32,330, VIP దర్శనాలు రూ.6,75,000, బ్రేక్ దర్శనాలు రూ.2,58,600, కార్ పార్కింగ్ రూ.5,50,000, వ్రతాలు రూ.1,42,400, సువర్ణ పుష్పార్చన రూ.97,400, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.42,98,487 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.
News January 18, 2025
రేపు భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737213960288_18661268-normal-WIFI.webp)
యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. ఉదయం 10.30 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.45 నిమిషాలకు భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. అనంతరం మీనా నగర్ కాలనీలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సతీమణి రోజా పార్ధివ దేహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12:45కు బయలుదేరి 2గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
News January 18, 2025
NLG: రేషన్ కార్డు లేని కుటుంబాలు 27,527
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737167208755_50283763-normal-WIFI.webp)
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.