News November 30, 2025
థైరాయిడ్ పేషెంట్లకు ఆర్థరైటిస్ ముప్పు

థైరాయిడ్ పేషెంట్లు, గతంలో అబార్షన్ అయిన మహిళలకు ఆర్థరైటిస్ ముప్పు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఆకలి తగ్గడం, జ్వరం, నీరసం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రధానంగా కీళ్లలో నొప్పి, వాపు, ఎర్రగా అవడం, కదలిక తగ్గడం, ఇతర అవయవాలపై ప్రభావం చూపించడం జరుగుతుంది. దీనిని నయం చేయలేము గానీ మంచి ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా తీవ్రతను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 14, 2026
టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

సంచలన ఆటతో U19 WC గెలుపులో <<19068083>>కీలక పాత్ర<<>> పోషించిన వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 17 నుంచి జరిగే CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ మేరకు అతడికి అడ్మిట్ కార్డు అందజేసినట్లు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్(బిహార్) ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా తెలిపారు. పరీక్షా హాలులో సాధారణ విద్యార్థి మాదిరే వైభవ్‌నూ చూస్తామని స్పష్టం చేశారు.
News February 14, 2026
OFFICIAL: నిజామాబాద్ కార్పొరేషన్‌లో హంగ్

TG: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడింది. అక్కడి 60 డివిజన్లలో బీజేపీ 28, కాంగ్రెస్-17, MIM-14 స్థానాలు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. మేయర్ పీఠం అధిష్ఠించడానికి (మ్యాజిక్ ఫిగర్ 31) బీజేపీ 3 సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్, MIM కలిస్తే మేయర్ పీఠం వారి సొంతమవుతుంది. అటు కొత్తగూడెం, కరీంనగర్ కార్పొరేషన్లలోనూ హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే.
News February 13, 2026
మున్సిపోల్స్: కరీంనగర్‌లో బీజేపీలోకి ఇద్దరి చేరిక

TG: కరీంనగర్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 13వ డివిజన్‌లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి తెల్ల లక్ష్మి, 15వ డివిజన్‌లో విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విపల సాయి జ్యోతి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 సీట్లు ఉండగా బీజేపీ 30 సీట్లు గెలిచింది. తాజాగా ఇద్దరి చేరికతో ఆ పార్టీ బలం 32కి చేరింది.


