News April 14, 2025

దండేపల్లిలో మహిళ ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లిలో జరిగింది. ఎస్ఐ తౌసుద్దీన్ తెలిపిన వివరాలు.. దండేపల్లికి చెందిన గంగాధరి వరలక్మి (38) భర్త వేధింపులు, కుటుంబ కలహాలతో ఆదివారం ఇంట్లో ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 24, 2026

జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో NGKL జిల్లావాసికి ప్రథమ బహుమతి

image

వనపర్తి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (DLSA) నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల్లో లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన అతినారపు సాయి సాగర్ మొదటి బహుమతి సాధించాడు. సామాజిక అవగాహన కోసం ఆయన రూపొందించిన చిత్రం న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించినందుకు సాయి సాగర్‌ను గ్రామస్థులు అభినందించారు.

News January 24, 2026

విశాఖ రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కార్యాలయం మార్పు

image

విశాఖ రైల్వే స్టేషన్ వద్ద రిజర్వేషన్ కౌంటర్‌ను మార్చుతున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జనవరి 26 నుంచి ప్రస్తుత రిజర్వేషన్ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు చెప్పారు. జనవరి 27 నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గేట్ నంబర్-2, నంబర్-3 మధ్యగల భవనంలో రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

News January 24, 2026

విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

image

రిపబ్లిక్ డే రద్దీ దృష్ట్యా విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. 08517 రైలు జనవరి 25న సాయంత్రం5.30కి విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కి చర్లపల్లి చేరుతుంది. తిరుగుపయనంలో 08518 రైలు జనవరి 26న మధ్యాహ్నం 3.30కి చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ వస్తుంది. ఈ రైళ్లు దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ మీదుగా ప్రయాణిస్తాయి.