News October 5, 2025

దండేపల్లి: దండారి ఉత్సవాలు.. గిరిజన కళల మేళా

image

దండేపల్లి మండలంలోని గుడి రేవు గ్రామ పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న “పద్మల్ పూరి కోక “ఆలయం గుస్సాడీ, దండారి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా దసరా నుంచి దీపావళి వరకు ఈ గుస్సాడీ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దండారి ఉత్సవాలకు తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివస్తారు. పద్మల పూరి కోక ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలు దీపావళి అమావాస్యతో ముగుస్తాయి.

Similar News

News January 20, 2026

విశాఖ కలెక్టర్‌కు అవార్డు

image

విశాఖపట్నం జిల్లా ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఉత్తమ ఎన్నికల జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. 2025లో నిర్వహించిన ఎన్నికల్లో అత్యుత్తమ విధానాలను అమలు చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన పేరును నామినేట్ చేశారు. జనవరి 25న విజయవాడలో జరగనున్న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

News January 20, 2026

ఓడరేవు అభివృద్ధిపై జిల్లా సలహా మండలి సమావేశం

image

నిజాంపట్నం ఓడరేవును అంతర్జాతీయ ప్రమాణాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఓడరేవు అభివృద్ధి జిల్లా సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవు అభివృద్ధి పనులతో పాటు సేవా పన్నుల సేకరణపై భాగస్వాముల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఏడీ సైదా తదితరులు పాల్గొన్నారు.

News January 20, 2026

నెల్లూరు: 27 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

నెల్లూరు జిల్లాలో ఈనెల 27 నుంచి ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఇంటర్ ఆర్ఐ, DEC సభ్యులతో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.విజయ్ కుమార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈనెల 21న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 23న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.