News November 19, 2025
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న PM మోదీ

ప్రధాని మోదీ ఈ నెల 21 నుంచి 23 వరకు సౌత్ ఆఫ్రికాలో పర్యటించనున్నారు. 22, 23 తేదీల్లో నిర్వహించనున్న 20వ G-20 సదస్సులో ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘G-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జొహన్నెస్‌బర్గ్‌లో పర్యటించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధాని 3 సెషన్లలో ప్రసంగిస్తారు. వివిధ నేతలతోనూ భేటీ అవుతారు. ఇది ఓ గ్లోబల్ సౌత్ దేశంలో వరుసగా నాలుగోసారి జరుగుతున్న G-20 సదస్సు’ అని పేర్కొంది.
Similar News
News January 23, 2026
ఉత్తమ్‌పై CM నిఘా అని వార్తలు.. మంత్రి క్లారిటీ

TG: CM రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి, ఉత్తమ్‌పై నిఘా పెట్టి దావోస్ వెళ్లారని ఓ SM పేజ్‌లో వచ్చిన వార్తపై ఉత్తమ్ కుమార్ స్పందించారు. అందులో అసలు నిజం లేదని పేర్కొన్నారు. ఆ వార్త సారాంశం ఏంటంటే.. ‘మంత్రులు vs CM పంచాయితీ హైకమాండ్‌కు చేరింది. మంత్రులు భట్టి, ఉత్తమ్ కుమార్‌ను 12మంది MLAలు కలిశారు. CM ఇద్దరు మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి వెళ్లారు’ అని వచ్చిన వార్తను మంత్రి ఖండించారు.
News January 23, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 23, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


