News June 18, 2024
దగదర్తి: నిలకడగా మాలేపాటి ఆరోగ్యం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కావలి నియోజకవర్గం నేత మాలేపాటి సుబ్బానాయుడు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. మాలేపాటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం ఐసీయూ నుంచి వార్డుకు మార్చే అవకాశం ఉందని తెలిపారు.
Similar News
News January 21, 2026
నెల్లూరు: ఈ నంబర్లకు కాల్ చేయండి..!

నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో బాల్య వివాహ ముక్త భారత్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా DLSA సెక్రటరీ కె.వాణి మాట్లాడుతూ.. పిల్లలు బాగా చదివి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పిల్లలకు మధ్యలో చదువులు ఆపి బాల్యవివాహాలు చేస్తే శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడతారని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098, 15100 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
News January 21, 2026
నెల్లూరులో సోలార్ పవర్ ప్రాజెక్ట్

నెల్లూరు జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం ప్రకటించారు. నెల్లూరు రూరల్ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయాన్ని మంత్రి సందర్శించారు. వేదగిరి ఆలయానికి 1176 ఎకరాల ఉన్నాయని.. అందులో 100 ఎకరాల్లో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇదే ఆలయ అభివృద్ధికి రూ.8.70 కోట్లు మంజూరు చేశామన్నారు. జిల్లాలో 57 ఆలయాలను రూ.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
News January 21, 2026
‘ఆత్మ’తో రైతులకు సాంకేతికత చేరువయ్యేనా..!

అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ATMA)పై విమర్శలొస్తున్నాయి. సాగులో వచ్చే సాంకేతిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ తరగతులు, ప్రదర్శనలు, కిసాన్ మేలా చేపట్టాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. ఏడాదికి 715 కార్యక్రమాలు జరగాల్సి ఉండగా 131 మాత్రమే చేపట్టారు. GOVT ₹59.52 లక్షలు మంజురు చేయగా ₹9.34 లక్షలు మాత్రమే రైతుల శిక్షణలకు కేటాయించారు. ఈ నిర్లక్ష్యంపై పలువురు మండిపడుతున్నారు.


