News December 1, 2025

దత్తాత్రేయ జయంతి.. ముస్తాబవుతున్న వరదవెల్లి ఆలయం

image

దత్తాత్రేయ జయంతి వేడుకలకు బోయినపల్లి మండలం వరదవెల్లి శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం ముస్తాబవుతోంది. మార్గశిర పౌర్ణమి నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి మూడు రోజులపాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం వరదవెల్లి గ్రామ గుట్టపై ఉండగా, మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్మాణం కారణంగా చుట్టూ నీరు చేరి మధ్యలో గుట్టపై ద్వీపంగా రూపాంతరం చెంది ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచుతోంది.

Similar News

News February 12, 2026

ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘నటరాజ’’

image

శివుడు సమస్త కళలకు, నాట్యానికి అధిపతి. ఆయన చేసే తాండవం సృష్టి గమనాన్ని సూచిస్తుంది. శివుడు ‘ఆనంద తాండవం’ చేస్తున్నప్పుడు సృష్టి నిర్మాణం జరుగుతుందని, ‘రుద్ర తాండవం’ చేసినప్పుడు దుష్టశిక్షణ జరుగుతుందని చెబుతారు. ప్రపంచంలోని అణువణువూ ఆయన చలనం (నాట్యం) వల్లే కదులుతోందని కొందరు శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు. నాట్య కళ ద్వారా విశ్వ రహస్యాలను వెల్లడించే ఈ సార్వభౌముడిని ‘నటరాజు’గా మనం కొలుచుకుంటాం.

News February 12, 2026

మహిళల్లో అధిక మూత్ర విసర్జనకు కారణాలివే..

image

వయసు తక్కువగా ఉన్నా కూడా అతిగా మూత్రవిసర్జనకు వెళ్తుంటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కారణమంటున్నారు నిపుణులు. పెల్విక్‌ నొప్పి, పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువగా అవడం, మెనోపాజ్ వల్ల ఇలా జరుగుతుందంటున్నారు. అలాగే మూత్రం ఆపుకోలేకపోవడానికి పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం, కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్ల మార్పుల వంటివి కారణం. దీన్ని నివారించడానికి కెగెల్‌ వ్యాయామాలు ఉపయోగపడతాయంటున్నారు.