News April 21, 2024

దర్శిలో టీడీపీ నేతకు ప్రమాదం.. స్పందించిన నారా లోకేశ్

image

దర్శి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. నాదెండ్ల బ్రహ్మం ప్రమాదంలో గాయపడటంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఫోన్లో వైద్యులతో మాట్లాడి అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. బ్రహ్మంకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Similar News

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.

News December 14, 2025

తెలంగాణలో పొదిలి, మార్కాపురం వాసులు మృతి.!

image

ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు ఈతకు వెళ్లి ఊపిరాడక మృతి చెందిన ఘటన తెలంగాణలో జరిగింది. పొదిలికి చెందిన సాయి ప్రసాద్, మార్కాపురంకి చెందిన రవితేజ, కంభంకి చెందిన వంశీకృష్ణలు నిజామాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు శుక్రవారం రాత్రి రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాగులో దిగారు. ఒక్కసారిగా ఊపిరాడక ప్రసాద్, రవితేజ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉదయం 5.30కి బయలుదేరే ఈ రైలు ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.