News July 7, 2024

దర్శి: క్షణికావేశంలో అన్నను హత్య చేసిన తమ్ముడు

image

దర్శి మండలం రాజంపల్లిలో విషాద ఘటన జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రావులపల్లి ప్రసాద్ మద్యం తాగి ఇంటికి వెళ్లి తల్లితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ప్రసాద్ మద్యం మత్తులో తల్లితో గొడవ పడుతుండగా తమ్ముడు బాలరాజు క్షణికావేశంలో కర్రతో ప్రసాద్‌ను బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 5, 2025

జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

image

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!

News December 5, 2025

ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

image

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.

News December 5, 2025

కొనకనమిట్ల : ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి!

image

కొనకనమిట్ల మండలంలోని పలు గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు పలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించినట్లు తెలిపారు. ఇళ్లలోని వస్తువులు సైతం కదిలినట్లు చెప్తున్నారు. ఆ సమయంలో నిద్రలో నుంచి లేచి భయాందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.