News February 4, 2025

దర్శి: గుప్తనిధుల కోసం తవ్వకాలు

image

దర్శి మండలం శివరాజ్ నగర్ శివారులోని శ్రీ సాయిబాబా గుడి శ్రీ దత్తాశ్రమం పక్కనగల కొండ పైన గుర్తుతెలియని కొందరు వ్యక్తులు గుప్తనిధుల కొరకు కొండను తవ్వుతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎస్ఐ మురళి తన సిబ్బందితో దాడి చేశారు. ఈ క్రమంలో ఐదుగురు కొండను తవ్వుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మురళి తెలిపారు.

Similar News

News February 20, 2025

వారబందీ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

వారబంది విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. కలెక్టర్ ఇరిగేషన్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన జిల్లా సరిహద్దు 85/3 మైలు వద్ద నుంచి వస్తున్న నాగార్జునసాగర్ నీటిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. వస్తున్న నీటిని పరిగణలోకి తీసుకొని జిల్లాలో నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు మళ్లించాలని తెలిపారు.

News February 19, 2025

ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఉండాలి: ఎస్పీ

image

ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రకాశం ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బుధవారం ఒంగోలులోని పోలీస్ కళ్యాణమండపంలో మహిళా పోలీసులతో ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత మనందరి బాధ్యత కావాలన్నారు. మహిళా ఫిర్యాదులు, పాటించవలసిన నియమాలపై మహిళా పోలీసులకు ఎస్పీ అవగాహన కల్పించారు.

News February 19, 2025

మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

image

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.

error: Content is protected !!