News October 8, 2025

దళితుల్ని ఇంకా చులకనగానే చూస్తున్నారు: మాజీమంత్రి

image

దళితులు ఏ స్థాయికి ఎదిగినా వారిని ఇంకా చులకనగానే చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటిదాకా వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ BR గవాయ్, రాష్ట్ర దళిత మంత్రిపై వ్యాఖ్యలు సమాజానికి అవమానమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తనపై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News January 23, 2026

ANU: PG రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ 1&2 సెమిష్టర్ రీవ్యాలేషన్ ఫలితాలను వర్సిటీ పరిశ్రమ నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. Msc కంప్లికేషన్ డేటా సైన్స్ 1వ సెమిష్టర్, బోటనీ 2వ సెమిష్టర్, కెమిస్ట్రీ 2వ సెమిస్టర్ రీవ్యాలేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.nagarjunanuniversity.ac.inను సంప్రదించాలన్నారు.

News January 23, 2026

విద్యార్థులతో కలిసి షటిల్ ఆడిన జగిత్యాల కలెక్టర్

image

కథలాపూర్ మండలం గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ షటిల్ ఆడారు. గణతంత్ర దినోత్సవం వేడుకల కోసం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. జడ్పీ హైస్కూల్లో జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి విద్యార్థులతో కాసేపు షటిల్ ఆడారు. జిల్లా కలెక్టర్ తో కలిసి సెటిల్ ఆడటం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.

News January 23, 2026

ASF: మెడికల్ ల్యాబ్‌ల పేరిట దోపిడీ

image

జిల్లాలో అక్రమ మెడికల్ ల్యాబ్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. అర్హత లేకున్నా రక్త పరీక్షల కేంద్రాలు నిర్వహిస్తూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో ధర వసూలు చేస్తున్నారు. కొంతమంది వైద్యులు కమీషన్ల కోసం అవసరం లేకున్నా రోగులను ఈ ల్యాబ్‌లకు పంపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.