News September 11, 2025
దసరాకి ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు: మంత్రి వాసంశెట్టి

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం రామచంద్రాపురంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా దసరా పండుగకు ఆటో డ్రైవర్లకు రూ.15,000 మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ‘సీఎం అంటే కామన్ మ్యాన్’ అనేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
పేరు మార్పుతో ప్రయోజనం ఏంటి: ప్రియాంకా గాంధీ

ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా మార్చాలన్న <<18543899>>కేంద్ర నిర్ణయం<<>>పై కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వలన ఏ ప్రయోజనం ఉంటుందో అర్థం కావడం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసులతో పాటు పత్రాలలో పేరు మార్చాల్సి రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఖర్చవుతుందని పేర్కొన్నారు. అనవసర వ్యయంతో ప్రజలకు లాభం ఏమిటని ప్రశ్నించారు.
News December 13, 2025
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్ సమయానికి ప్రారంభించి, ఎటువంటి జాప్యం లేకుండా ఫలితాలను వెల్లడించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
News December 13, 2025
రెండు రోజుల్లో బుల్లెట్ నేర్చుకున్న బామ్మ

వయసులో ఉన్న అమ్మాయిలే బుల్లెట్ బండి నడపాలంటే అమ్మో అంటారు. కానీ చెన్నైకి చెందిన 60 ఏళ్ల లతా శ్రీనివాసన్ రెండు రోజుల్లో బుల్లెట్ బండి నడిపి ఔరా అనిపించారు. రిటైర్మెంట్ తర్వాత తనకిష్టమైన బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుకున్న లత ఒక అకాడమీలో చేరారు. అక్కడ మొదటి రోజు క్లచ్.. గేర్ మార్చడం నేర్చుకుంది. రెండో రోజునే సెకండ్.. థర్డ్ గేర్‌లో స్మూత్‌గా బైక్ నడపడం మొదలుపెట్టి ట్రెండ్ సెట్టర్‌గా మారారు.


