News October 8, 2025

దసరా మహోత్సవం విజయవంతం: కలెక్టర్ లక్ష్మీశా

image

2025 సంవత్సరానికి సంబంధించి దసరా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ దాన్య చంద్ర అన్నారు. దసరా మహోత్సవంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందించి, అభినందనలు తెలిపారు.

Similar News

News January 21, 2026

పెద్దపల్లి: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో DWSM విభాగంపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రజలకు నీటి సమస్య రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తూ, ప్రతి గ్రామానికి నీరు అందేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News January 21, 2026

కాకినాడ: పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై సమీక్ష

image

కాకినాడ నగరపాలక సంస్థకు వస్తున్న పిజిఆర్ఎస్ అర్జీలను అన్ని విభాగాలు సమన్వయంతో పరిష్కరించాలని కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. నగర పరిధిలో పౌర ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

News January 21, 2026

ఉట్నూర్‌లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్

image

ఉట్నూర్ మండలం కుమ్మరి తాండలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గిరిజన బిడ్డలు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనభ్యసించి, దేశ భవిష్యత్తును నిర్మించే ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యేలు అధికారులు ఉన్నారు.