News August 13, 2025
దామరాజు పుండరీకాక్షుడు: స్వాతంత్ర్య సమరయోధుడు

దామరాజు పుండరీకాక్షుడు(1898-1975) ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, తర్వాత న్యాయవాదిగా మారారు. 1921లో ‘స్వరాజ్య సోపానం’ అనే నాటకం రాశారు, దానిని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. తిరిగి 1961లో ప్రచురించారు. అతను 13 తెలుగు నాటకాలు, 2 ఆంగ్ల నాటకాలు రాశారు. ‘స్వరాజ్యసోపానం’ అనే పత్రికను నడిపారు. అతని నాటకాలను గాంధీ నాటకాలని పిలిచేవారు.
Similar News
News March 10, 2026
అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.
News March 10, 2026
మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.
News March 10, 2026
కొయ్యలగూడెం: ఈ నెల 25 నుంచి పొగాకు కొనుగోళ్లు

ఎన్ఎల్ఎస్ పరిధిలో వర్జీనియా పొగాకు వేలం కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు వేలం నిర్వహణ అధికారి శివకుమార్ తెలిపారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం1,2, దేవరపల్లి, గోపాలపురంలోని ఐదు కేంద్రాల్లో వేలం జరుగుతుందన్నారు. సుమారు 4,816 హెక్టార్లలో పొగాకు సాగు చేస్తున్న 2,673 మంది రిజిస్టర్డ్ రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.


