News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.
Similar News
News February 18, 2026
ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

AP: పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి DMHO దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన మహిళలు ఫిబ్రవరి 20వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రొవిజినల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు. వయసు 25నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి. వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
News February 18, 2026
టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <
News February 18, 2026
అంబటికి బెయిల్

AP: YCP నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీడ్రా పేరిట మోసం చేశారంటూ ఆయనపై సత్తెనపల్లి పీఎస్‌లో కేసు నమోదైైంది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా CBNను దూషించిన కేసు, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇప్పటికే ఆయనకు బెయిల్ లభించింది. అంబటి ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


