News December 1, 2025
‘దిత్వా’.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు భారీ వర్ష సూచన

‘దిత్వా’ తుఫాన్ ప్రభావం కారణంగా DEC 2 నుంచి 5 వరకు తీవ్ర వర్ష ప్రభావం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Similar News
News February 13, 2026
జగిత్యాల: కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్, కలెక్టర్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని SKNR డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కౌంటింగ్ జరుగుతున్న తీరును జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ పరిశీలించారు.
News February 13, 2026
వైరాలో నాడు భర్త.. నేడు భార్య ఘన విజయం

వైరా మున్సిపాలిటీలో ముల్లపాటి కుటుంబం మరోమారు సత్తా చాటింది. 2018లో ముల్లపాటి సీతారాములు కౌన్సిలర్‌గా గెలిచి, వైస్ చైర్మన్ కాగా.. తాజాగా శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఆయన భార్య విజయలక్ష్మి 13వ వార్డు నుంచి జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థిపై 239 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. ఈ గెలుపుతో పార్టీ శ్రేణులు, అభిమానులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ పట్టణంలో భారీ విజయోత్సవం నిర్వహించారు.
News February 13, 2026
2029లో రాహుల్ PM.. తొలుత చేసే పని ఇదే: మాణికం ఠాగూర్

2029లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ PM అవుతారని ఆ పార్టీ MP మాణికం ఠాగూర్ అభిప్రాయపడ్డారు. ఆయన అధికారంలోకి రాగానే పాలనలో పాతుకుపోయిన ‘సీక్రెసీ కల్చర్’ను రూపుమాపేలా గైడ్‌లైన్స్ తీసుకొస్తారని చెప్పారు. దేశ ప్రయోజనాలు, ఆర్మీ గౌరవాన్ని కాపాడడం ముఖ్యమే అయినప్పటికీ.. పాలనలో పారదర్శకత కూడా ఉండాలని పేర్కొన్నారు. ఇది రాజకీయం కాదని.. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రజల హక్కని వ్యాఖ్యానించారు.


