News August 12, 2025

దిలావర్పూర్: ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి’

image

దిలావర్‌పూర్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం నూతన స్వయం సహాయక సంఘాలు, విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులు, కిశోర బాలికల సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ చరణ్ దాస్ మాట్లాడారు. మహిళా సంఘాలకు రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్ గంగన్న, ఇతర ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 16, 2026

అమెరికాలో ప్రవాసుల వరుస మరణాలు

image

అమెరికాలో స్థిరపడిన వరంగల్‌ వాసుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం వ్యవధిలోనే నగరానికి చెందిన ముగ్గురు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 10న కొత్త శ్వేత(40), 13న చిదురాల విజయవాణి(55), తాజాగా తాడిపత్రి రాకేష్‌(40) మృతి చెందారు. వరుస అకాల మరణాలతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News March 16, 2026

కలెక్టర్‌కు ఉద్యోగ సంఘాల అభినందనలు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సెంటర్ ఫర్ మైగ్రేషన్ స్థాపించి, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి రప్పిస్తున్న కలెక్టర్ మహేష్ కుమార్‌ను ఉద్యోగ సంఘాలు సోమవారం ఘనంగా సన్మానించాయి. అమరావతి జేఏసీ ఛైర్మన్ వి.ఎస్ దివాకర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆయనకు బొకేలు అందజేశారు. కలెక్టర్ కృషికి రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సాయిబాబు, గణేశ్ పాల్గొన్నారు.

News March 16, 2026

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

image

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా మైనర్ అని, 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని తెలిపారు. ఫర్మాన్‌ ఖాన్‌‌తో వివాహం చట్టబద్ధంగా చెల్లదని పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా <<19360382>>మరోసారి<<>> స్పష్టం చేశారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.