News November 19, 2025

దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

image

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.

Similar News

News January 21, 2026

ఖానాపూర్‌లో రూ.13కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం

image

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

News January 21, 2026

FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.

News January 21, 2026

కిషన్ రెడ్డి గారూ ఇది మీ అజ్ఞానమా… లేక: KTR

image

TG: సింగరేణి స్కామ్‌లో ప్రధాన దోషే CBI <<18916865>>విచారణ<<>> కోరాలని ఆశించడం మూర్ఖత్వం కాదా అని కిషన్ రెడ్డిపై KTR మండిపడ్డారు. ‘సీఎం అక్రమ పద్ధతితో తన బావమరిదికి టెండర్‌ను కట్టబెట్టారు. దొంగే PSకు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? BRS బయటపెట్టిన సింగరేణి స్కామ్‌పై కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి తీరు అలాగే ఉంది. ఇది మీ అజ్ఞానమా లేక రేవంత్‌తో బీజేపీకున్న చీకటి ఒప్పందమా’ అని ప్రశ్నించారు.