News October 20, 2024
దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్: మంత్రి ఆనం

సూపర్ సిక్స్ పథకాల అమలే ప్రధాన లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళికి ఆడపడుచులకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయబడుతుందని తెలిపారు. ఆత్మకూరు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ప్రణాళికా బద్దంగా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు పరుస్తామని తెలిపారు.
Similar News
News July 9, 2025
నల్లపురెడ్డిపై మహిళా కమిషన్ ఫిర్యాదు

YSRCP మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజను కలిసి కార్పొరేటర్ ఉషారాణి ఫిర్యాదు చేశారు. ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలు దౌర్జన్యంగా ఉన్నాయని విమర్శించారు. నల్లపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
News July 8, 2025
10న నెల్లూరు జిల్లాలో కీలక సమావేశం

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3,600 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. వీటితో పాటు 143 కళాశాలల్లోనూ ఈ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. డీఈవో బాలాజీ రావు, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెంకటప్పయ్య పాల్గొన్నారు.
News July 8, 2025
నెల్లూరు రాజకీయాలకు మాయని మచ్చ..!

హుందాగా నడిచే నెల్లూరు రాజకీయాలు వ్యక్తిగత దూషణలకు వెళ్లాయి. పర్సంటేజీల ప్రసన్న, అప్పుల్లో పీహెచ్‌డీ చేసిన ప్రసన్న అంటూ ప్రశాంతి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆయన శ్రుతిమించారు. ‘ప్రశాంతి రెడ్డి చాలా చోట్ల PHdలు చేశారు. పీహెచ్‌డీలు అంటే మీరు అనుకునేవి కావు. వేమిరెడ్డిని బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. ఆయనకు ప్రాణహాని ఉంది’ అని ప్రసన్న అన్నారు. ఈ ఇద్దరి వ్యాఖ్యలపై మీరేమంటారు?