News February 17, 2025

దుకాణాల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోండి: కలెక్టర్ 

image

నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రోడ్డులోని ఖాళీ ప్రదేశాల్ని పారిశుద్ధ్యంతో నిండి ఉన్నాయని తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. మండలాల్లో రోడ్లపైనే చెత్త వెయ్యకుండా అన్ని దుకాణాల వద్ద తడి-పొడి చెత్త వేరువేరుగా వేసేలా డస్ట్ బిన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. డస్ట్ బిన్లు ఏర్పాటు చేయకపోతే సంబంధిత దుకాణాలకు అపరాధ రుసుం వేయాలన్నారు.

Similar News

News March 10, 2026

వాడిన నూనె వాడితే క్యాన్సర్ ముప్పు: రామయ్య

image

అమలాపురం హోటళ్లు, రెస్టారెంట్లలో వాడిన వంట నూనెను తిరిగి వాడటం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని ఆహార భద్రతా అధికారి రామయ్య హెచ్చరించారు. సోమవారం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. మిగిలిన నూనెను నిల్వ చేయరాదని, నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 9, 2026

నెల్లూరులో విషాదం.. బాలుడి అక్కడికక్కడే మృతి

image

ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలుడు బైక్‌ని తీసుకుని స్నేహితుని కలిసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్‌లోని కలివెలపాలెం గ్రామానికి చెందిన వివాన్ (16) ఇంట్లో ఎవరు లేకపోవడంతో బైక్‌ని తీసుకొని నెల్లూరు వైపు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొని తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 9, 2026

గుడివాడలో 11న భారీ జాబ్ మేళా

image

నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ శుభవార్త చెప్పింది. మార్చి 11న కృష్ణాజిల్లా గుడివాడలోని కళాశాలలో ఉదయం 9 గంటలకు భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. 10 ప్రముఖ కంపెనీల్లో 505 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు రెజ్యూమ్, సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 98488 19682 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు.