News August 11, 2025
దుబ్బాకలో BRS vs కాంగ్రెస్.. వేడెక్కిన రాజకీయం

దుబ్బాకలో BRS vs కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పియడంతో దుబ్బాక ఇన్‌ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటుండడంతో పరిస్థితులు హాట్ హాట్‌గా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి వివేక్ పర్యటన సైతం రద్దయింది.
Similar News
News March 12, 2026
యుద్ధం ఎఫెక్ట్.. వరంగల్ జిల్లాలో పెరిగిన వంట నూనె ధరలు!

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వరంగల్ జిల్లాలో ఈ ధరలు లీటరుకు రూ.15-25 వరకు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. గతంలో సన్‌ఫ్లవర్ రూ.145-155 ఉండగా ఇప్పుడు రూ.180కి పెరిగింది. పామాయిల్ రూ.100-110 ఉండగా, ఇప్పుడు రూ.160 వరకు పెరిగాయి. వేరుశనగ నూనె రూ.180కి పెరిగింది. హోల్ సెల్ వ్యాపారులు బ్లాక్ చేయడం వల్లే వంట నూనె ధరలు పెరుగుతున్నట్లు రిటైల్ వ్యాపారులు తెలిపారు.
News March 12, 2026
16న ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

AP: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర స్థాయి, అన్ని జిల్లా కేంద్రాల్లో ఇఫ్తార్ విందుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.50 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 16న విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. జిల్లాల స్థాయిలో వచ్చే 5 రోజుల్లో కలెక్టర్లు తమకు అనువైన రోజున ఇఫ్తార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది.
News March 12, 2026
జీకేవీధి: ఊబ పొలం..ఊటనిరే ఆధారం

అల్లూరి జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మంచినీటికి ఇబ్బందులు తప్పడం లేదు. గుక్కెడు మంచినీటికి అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఆయా గ్రామాల గిరిజనులది. అలా అల్లూరి జిల్లా రింతాడ పంచాయతీ ఊబపొలం గ్రామంలో మంచినీటి మంచినీళ్లు దొరక్క పొలాల గట్ల వద్ద ఊరే ఊట నీటినే ఆధారంగా జీవిస్తున్నారు. వర్షం వస్తే ఆ ఊట నీరు బురదగా మారుతున్నాయని స్థానిక మహిళలు తెలిపారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు


