News March 15, 2025

దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

image

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.

Similar News

News February 12, 2026

రేపు యథావిధిగా రవాణా శాఖ సేవలు: డీటీఓ

image

ఖమ్మం జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాల్లో రేపు అన్ని రకాల సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని డీటీఓ ధర్మపురి జగదీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంతో పాటు సత్తుపల్లి, వైరాలోని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకోవచ్చని, వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల జారీ తదితర సేవల కోసం కార్యాలయాలకు రావచ్చని పేర్కొన్నారు.

News February 12, 2026

RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

image

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

News February 12, 2026

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్‌ బాధ్యతల స్వీకరణ

image

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ (కోల్‌ మూమెంట్‌), చీఫ్ విజిలెన్స్‌ ఆఫీసర్ బి.వెంకన్న ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు.