News September 10, 2025

దువ్వాడ మీదుగా హైదరాబాద్ – భువనేశ్వర్‌కు ప్రత్యేక రైళ్లు

image

దసరా, దీపావళి సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దువ్వాడ మీదుగా హైదరాబాద్ – భువనేశ్వర్‌కు (07165/66) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్‌లో బయలుదేరి భువనేశ్వర్ చేరుకుంటుంది. మరుసటి రోజు (బుధవారం) భువనేశ్వర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించాలని సూచించారు.

Similar News

News December 13, 2025

అనుకోని అతిథి ఎందుకొచ్చారు?

image

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే <<18545632>>CM రేవంత్ రెడ్డి<<>>తో, ఆ వెంటనే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ KCRను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో BJPకి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.

News December 13, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✓నేటితో ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓రేపు సారపాక, పినపాక ప్రాంతాల్లో పవర్ కట్
✓సుజాతనగర్ PHCని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
✓బూర్గంపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✓భద్రాచలం: ముక్కోటి గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✓మణుగూరు: అడవిలో చెట్ల నరికివేత హైకోర్టు బ్రేక్
✓రేపు నవోదయ ప్రవేశ పరీక్ష… జిల్లాలో 8 కేంద్రాలు

News December 13, 2025

యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

image

దేశంలో యోగా ప్రచారం, హర్బల్‌ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.