News May 13, 2024
దేవరకొండలో మందకొడిగా పోలింగ్

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంట వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతమిలా..భువనగిరి ఎంపీ సెగ్మెంట్ ఓటింగ్ (62.05%) .. ఇబ్రహీంపట్నం – 52.03, మునుగోడు -67.60, భువనగిరి -66.22, NKL -61.54, తుంగతుర్తి -62.36, ALR -68.41, జనగామ -60.40, NLG -64.67, దేవరకొండ-49.30, నాగార్జునసాగర్ -63.29, MLG -54.72, HNR-64.87, KDD-63.79, సూర్యాపేట-59.20.
Similar News
News December 11, 2025
MGU పీజీ సెమిస్టర్-3 పరీక్షల టైం టేబుల్ విడుదల

MGU పరిధిలో నిర్వహించనున్న పీజీ (MA, M.Com, M.Sc, M.S.W) సెమిస్టర్-3 రెగ్యులర్ పరీక్షల టైం టేబుల్‌ను డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి వచ్చే నెల జనవరి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సంబంధిత టైం టేబుల్‌ను విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ తేదీలను గమనించాలని కోరారు.
News December 11, 2025
BREAKING: చౌటుప్పల్ హైవేపై భారీగా ట్రాఫిక్

గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున పల్లె బాట పట్టారు. పట్నం ప్రజలు సొంతూళ్లకు తరలిరావడంతో చౌటుప్పల్ వద్ద హైవేపై భారీగా వాహనాలు బారులు తీరాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాల్లో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఉదయం 9 గంటల వరకు 19.58 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
News December 11, 2025
నల్గొండ: దరఖాస్తులకు మూడు రోజులే గడువు

జిల్లాలోని 14 పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించడానికి ఆసక్తి, కరాటే బ్లాక్ బెల్ట్ కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. కరాటే బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లు, పూర్తి బయోడేటాతో ఈనెల 15లోగా నగొండలోని యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేల చొప్పున పారితోషికం ఇస్తామన్నారు.


