News August 11, 2025

దేవరకొండ: ‘ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి’

image

దేవరకొండలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వలమల్ల ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ చరిత్రలో నిలిచిందన్నారు. ఈనెల 12 నుంచి 31 వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Similar News

News March 13, 2026

NLG: గ్యాస్ ‘గందరగోళం’.. సర్వర్లు డౌన్

image

జిల్లాలో సామాన్యుడి వంట గదిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు ఒక్కసారిగా రీఫిల్లింగ్ కోసం ఎగబడుతుండటంతో బుకింగ్ నెట్‌వర్క్ పూర్తిగా కుప్పకూలింది. వినియోగదారులు గ్యాస్ రీఫిల్ కోసం ఆశ్రయించే డిజిటల్ మార్గాలు ప్రస్తుతం చేతులెత్తేశాయి. వేల సంఖ్యలో వినియోగదారులు ఏకకాలంలో ప్రయత్నిస్తుండటంతో మిస్డ్ కాల్, IVRS వ్యవస్థలు పనిచేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

News March 13, 2026

జిల్లా రైతాంగంపై రూ.35 కోట్ల అదనపు భారం!

image

పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, ఈ ధరల పెరుగుదల వల్ల జిల్లా రైతాంగంపై సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.

News March 13, 2026

NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.