News January 27, 2025
దేవాలయాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ఎస్పీ

కృష్ణా జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు వంటి ప్రార్థన మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ గంగాధర్ రావు అధికారులకు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎస్పీ సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్నేహపూర్వక పోలీసింగ్ ప్రజలకు అందిస్తూ, మహిళలు, చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు.
Similar News
News February 19, 2025
పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.
News February 18, 2025
గుడివాడ: కొడాలి నాని ఆసక్తికర్ వ్యాఖ్యలు

రెడ్ బుక్ గురించి తనకు తెలియదని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండటం లేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్‌గా ఉన్నాం. మా ఉద్యోగం పీకేశారు. ఇప్పుడు యాక్టివ్‌గా ఉండి ఏం చేయాలి’ అంటూ సెటైరికల్ ఆన్సర్ ఇచ్చారు. వంశీ అరెస్ట్ లాంటివి చిన్న చిన్న విషయాలని అన్నారు.
News February 18, 2025
కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.