News September 12, 2025
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న భద్రకాళి ఆలయం

వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. రూ.10 లక్షలతో దేవాలయ ఆర్చీలు, గర్భాలయం, స్తంభాలు, ప్రాంగణం, రాజగోపురానికి రంగులు వేస్తున్నారు. ఈ మొత్తం ఖర్చు దాతలు ముందుకు వచ్చి చేయిస్తున్నట్లు దేవాలయ అధికారులు స్పష్టం చేశారు. ఇదే కాకుండా ఇతర పనులు కూడా దాతల సహకారంతో చేయనున్నట్లు వివరించారు. నవరాత్రి ఉత్సవాల నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు.
Similar News
News December 13, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

✓నేటితో ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం
✓రేపు సారపాక, పినపాక ప్రాంతాల్లో పవర్ కట్
✓సుజాతనగర్ PHCని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
✓పాల్వంచ పెద్దమ్మ తల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
✓బూర్గంపాడు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
✓భద్రాచలం: ముక్కోటి గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్
✓మణుగూరు: అడవిలో చెట్ల నరికివేత హైకోర్టు బ్రేక్
✓రేపు నవోదయ ప్రవేశ పరీక్ష… జిల్లాలో 8 కేంద్రాలు
News December 13, 2025
యోగ, ఆయుష్ సేవల విస్తరణపై ప్రశ్నించిన ఎంపీ కావ్య

దేశంలో యోగా ప్రచారం, హర్బల్ ఔషధాల నాణ్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్ సేవల విస్తరణ వంటి కీలక అంశాలపై లోక్ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్వహించిన జాతీయ, ప్రాంతీయ యోగా క్యాంపైన్ల వివరాలు, వాటిలో పాల్గొన్న వారి సంఖ్య, కేటాయించిన బడ్జెట్‌ను వివరించాలని ఎంపీ కేంద్రాన్ని కోరారు.
News December 13, 2025
సిద్దిపేట: ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది సస్పెండ్

ఈనెల 11న సిద్దిపేట జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల విధులకు హాజరుకాని 182 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె. హైమావతి తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ముందస్తుగానే కలెక్టర్ హెచ్చరించినప్పటికీ విధులకు గైర్హాజరు కావడంతో వారిపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.


