News January 28, 2025

దేవుళ్లకు సైతం కాంగ్రెస్ మొండి చెయ్యి: హరీశ్ రావు

image

ధూప, దీప నైవేద్యాలకు పైసలు ఇవ్వకుండా దేవుళ్లకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశీ రావు విమర్శించారు. ధూప, దీప నైవేద్యాలకు పైసలు లేక, ఉద్దెరకు పూజ సామగ్రి తెస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రెండు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ CMOకు టాగ్ చేశారు.

Similar News

News February 13, 2025

క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్ 

image

క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.

News February 13, 2025

జగిత్యాల: బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

మార్చి 10 నుంచి నిర్వహించే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ధర్మపురిలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని, ఎండకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

News February 13, 2025

వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!