News April 23, 2025

దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత

image

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం జిల్లాలోని దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News March 12, 2026

జహీరాబాద్: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

image

భార్య హత్య కేసులో భర్తకు సంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. 2012లో జహీరాబాద్‌కు చెందిన లక్ష్మీతో రాములకు పెళ్లైంది. మద్యానికి బానిసైన రాములు తరచుగా భార్యతో గొడవ పడేవాడు. దీంతో లక్ష్మి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో 2021లో భార్య లక్ష్మిని రాములు స్మశాన వాటిక వద్దకు తీసుకువెళ్లి చున్నీతో హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.

News March 12, 2026

SVU: ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం

image

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed/ B.P.Ed/ D.P.Ed 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలోని రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 12, 2026

ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

image

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.