News January 23, 2025
దోమకొండ: దుబాయిలో యువకుడి ఆత్మహత్య

చేసిన అప్పులు తీర్చలేక దుబాయ్ దేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దోమకొండ మండలం చింతామణి పల్లి గ్రామానికి చెందిన స్వామి మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లినట్టు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల ఇంటికి వచ్చిన ఆయన తిరిగి మళ్లీ దుబాయ్ వెళ్లినట్లు చెప్పారు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక అక్కడ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలపారు.
Similar News
News February 15, 2025
కంచిలి: గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్

కంచిలి మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం సాయంత్రం కంచిలి ఎస్సై పారినాయుడు పట్టుకున్నారు. వీరి నుంచి 2 కేజీల గంజాయి, 2 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రం సుర్లా నుంచి తరలిస్తుండగా ముగ్గురిని పట్టుకున్నామని తెలిపారు. వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
News February 15, 2025
పెబ్బేరు: షార్ట్ సర్క్యూట్‌తో ఎలక్ట్రికల్ షాప్ దగ్ధం

పెబ్బేరు మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ షాప్ అగ్నికి ఆహుతి అయింది. షాప్ యజమాని గౌని యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ.. షాప్‌లో ప్లాస్టిక్, పీవీసీ సామన్లు మొత్తం కాలిపోయాయని నష్టం భారీ ఎత్తున ఉందని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
News February 15, 2025
పెద్దపల్లి: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా: DAO

పెద్దపల్లి జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. యాసంగి సీజన్లో సాగువిస్తీర్ణం, రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 37వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా ప్రకారం దిగుమతికి చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, DCMS, రైతు ఉత్పత్తి దారుల సంస్థలు ద్వారా రైతులకు ఆయా మండలాల వారీగా సరఫరా చేస్తామన్నారు.