News February 16, 2025

ద్వారకాతిరుమల : వైసీపీ సీనియర్ నాయకుడు రాజబాబు మృతి

image

ద్వారకాతిరుమలలోని సీహెచ్ పోతే పల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజబాబు శనివారం రాత్రి మృతిచెందారు. ఆయన ఇటీవల బాత్రూంలో జారి పడటంతో కాలు విరిగింది. అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి మృతి చెందారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 19, 2026

59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.

News April 19, 2026

ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

image

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.

News April 19, 2026

నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!

image

గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోంది. సదరు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.