News December 2, 2025
ధన్వాడ: ఎన్నికల చిత్రాలు.. ఉదయం బీఆర్ఎస్, రాత్రికి కాంగ్రెస్!

ధన్వాడ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విచిత్ర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉదయం కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నీరిటి రామచంద్రయ్య సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే, రాత్రికి మళ్లీ డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి సమక్షంలో ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఈ అనూహ్య పరిణామంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్‌లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News February 11, 2026
DRDOలో 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 11, 2026
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 గం.వరకు 6% పోలింగ్

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో 9గం.ల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. 92 వార్డుల్లో మొత్తం 99,313 ఓటర్లు ఉండగా కామారెడ్డి 3662 (3.69%), బాన్సువాడ 2,296 (9.49%), బిచ్కుంద 1,830 (14.34), ఎల్లారెడ్డి1182 (8.91%) లలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చలి తీవ్రత కారణంగా పోలింగ్ మందకోడిగా సాగుతుండగా మధ్యాహ్నం వరకు వేగం పుంజుకోనున్నట్లు అధికారులు తెలిపారు.


