News December 15, 2025

ధరలు మార్చకుండా ప్రయోజనాలు తగ్గించిన AIRTEL

image

ఎయిర్‌టెల్‌ తన అన్‌లిమిటెడ్ 5G బూస్టర్ ప్యాక్‌ల డేటా ప్రయోజనాలను గణనీయంగా తగ్గించింది. ₹51, ₹101, ₹151 ప్యాక్‌లపై గతంలో లభించిన 3GB, 6GB,9GB డేటా ఇప్పుడు 1GB, 2GB,3GBకు తగ్గించింది. ధరలు మారనప్పటికీ డేటా తగ్గడంతో వినియోగదారులకు నష్టం కలగనుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ ప్యాక్‌ల ప్రయోజనాలనూ ఇలానే తగ్గించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

Similar News

News January 19, 2026

హర్షిత్ రాణాను చూసి NZ ప్లేయర్స్ వణికారు: క్రిస్ శ్రీకాంత్

image

NZతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా (52) తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఎంపికను విమర్శించిన మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ ఇప్పుడు హర్షిత్ ఆటతీరుకు ఫిదా అయ్యారు. ‘హర్షిత్ బ్యాటింగ్ చూస్తుంటే కివీస్ బౌలర్లు వణికిపోయారు. అతడు రియల్ గేమ్ ఛేంజర్’ అని ప్రశంసించారు. కోహ్లీ సెంచరీ వృథా అయినా.. హర్షిత్ పోరాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

News January 19, 2026

నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

image

BJP జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి సంకేతం ఇవ్వడంతో పాటు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా, PM మోదీ, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. నబీన్ అధ్యక్షతన 2029 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కానుంది.

News January 19, 2026

అగాథం నుంచి అగ్రస్థానానికి తెచ్చాం: CM

image

తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అగాథంలో కూరుకుపోయిందని దావోస్ పర్యటనలో AP CM CBN అన్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని చూసిన వారంతా దాన్ని బాగు చేయగలుగుతారా? అని సందేహించారు. అసాధ్యమనీ అన్నారు. దిగిన తర్వాత ఎంత అగాథంలోకి వెళ్లిందో అర్థమైంది. అలాంటి రాష్ట్రాన్ని18 నెలల్లో నంబర్ 1 బ్రాండ్‌గా తయారుచేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో వెళ్లాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం’ అని తెలిపారు.