News September 12, 2025
ధరూర్: భూ త్యాగాలు మావి.. వంతెన వారికా- ప్రజలు

జూరాల ప్రాజెక్టు వద్ద హైలెవల్ వంతెన నిర్మాణం ఇక్కడ స్థానిక ప్రజల చిరకాల వాంఛ. జూరాల నిర్మాణానికి పరిసర గ్రామాల ప్రజలు అప్పట్లో తమ భూములను ఇచ్చారు. జూరాల ప్రాజెక్ట్ దిగువన వంతెన నిర్మిస్తామని ప్రభుత్వం జూలై 1న జీవో జారీ చేసి ఉన్నపళంగా కొత్తపల్లి–జూరాల మధ్యకు మార్చడంపై గ్రామస్థులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈరోజు రేవులపల్లి రామాలయం వద్ద సమావేశమై కలెక్టర్‌లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు.
Similar News
News December 10, 2025
ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కల్వకుర్తి, ఊరుకొండ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సామగ్రి పంపిణీ విధానాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పరిశీలించారు. ఎన్నికల బృందాల హాజరు, పోలింగ్ మెటీరియల్ అందజేత, రవాణా వాహనాల సంసిద్ధతను సమీక్షించారు. పోలింగ్ సిబ్బందికి అల్పాహారం, భోజనం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News December 10, 2025
కడప నగర నూతన YCP మేయర్ ఇతనే.!

కడప నగర నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. కాసేపటి క్రితం కడపలోని MP నివాసంలో జరిగిన సమావేశంలో YS అవినాశ్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా 47 డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్ పేరును వైసీపీ కార్పొరేటర్లు ఆమోదించారు. దీంతో రేపు ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
News December 10, 2025
క్యాన్సర్ బాధితుడి తొలగింపు.. మానవత్వం మరిచారా?

పుణే(MH)లో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ ఉద్యోగిని కంపెనీ అకస్మాత్తుగా తొలగించింది. ‘నాకు జీతం కాదు.. నా జీవితం కావాలి. నా కుటుంబ భవిష్యత్తు కోసం న్యాయం చేయండి’ అంటూ ఆ ఉద్యోగి అనారోగ్యాన్ని లెక్కచేయకుండా కంపెనీ గేటు ముందు నిరాహార దీక్షకు దిగాడు. కష్టకాలంలో అండగా ఉండాల్సిన కంపెనీ ఇలా తొలగించడం దారుణమని వాపోయాడు. కంపెనీ తీరుపై నెట్టింట తీవ్ర విమర్శలొస్తున్నాయి.


