News April 20, 2024

ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల ఆస్తులు

image

NZB బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై 22 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అర్వింద్‌ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. ఎలాంటి భూముల్లేవు. జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లుగా ఉన్నాయి.

Similar News

News December 7, 2025

NZB: రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ సమక్షంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. 1,476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా 20 శాతం అధనంగా సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచుతూ ర్యాండమైజేషన్ చేపట్టారు.

NZB: 2వ విడతలో 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

image

2వ విడత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 38 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ధర్పల్లి మండలంలో 6, డిచ్పల్లి మండలంలో 7, ఇందల్ వాయి, NZB రూరల్ మండలాల్లో 4 చొప్పున, మాక్లూర్ మండలంలో 7, మోపాల్ మండలంలో 1, సిరికొండ మండలంలో 6, జక్రాన్ పల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు. మిగిలిన 158 సర్పంచ్ పదవుల కోసం 587 మంది బరిలో నిలిచారన్నారు.