News October 27, 2024
ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం 2,04,412 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. టికెట్ల ద్వారా 1,15,614 రూపాయలు, ప్రసాదాల ద్వారా 70,240 రూపాయలు, అన్నదానం కోసం 18,558 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
Similar News
News November 14, 2024
రాజన్న ఆలయంలో ఘనంగా కృష్ణ తులసి కళ్యాణం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కృష్ణ తులసి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులకు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
News November 14, 2024
ఈనెల 16న కరీంనగర్‌కు టీపీసీసీ చీఫ్
ఈనెల 16న కరీంనగర్‌లో TPCC అధ్యక్షులు, MLC మహేశ్ కుమార్ గౌడ్ పర్యటిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా గార్డెన్స్‌లో KNR పార్లమెంట్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో సమగ్ర కుటుంబ సర్వే, పార్టీ సమన్వయం, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన, తదితర అంశాలపై చర్చ కొనసాగుతుందన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని MLA డా.కవ్వంపల్లి పిలుపునిచ్చారు.
News November 14, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ప్రభుత్వ ఆసుపత్రిలలో ప్రసవాలను పెంచాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి మండలంలో సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జగిత్యాలలో ఓ హోటల్లో భోజనంలో వచ్చిన స్ప్రింగ్. @ మల్లాపూర్ మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి రిమాండ్.