News May 7, 2025
ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయం రూ.1,29,618

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,29,618 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో టికెట్లు అమ్మకం ద్వారా రూ.60,216, ప్రసాదాలు ద్వారా రూ.47,030, అన్నదానానికి రూ.22,372 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Similar News
News February 15, 2026
నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.
News February 15, 2026
రష్యా ఆయిల్ ఆపేస్తామని ఇండియా హామీ ఇచ్చింది: రుబియో

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను ఆపేస్తామని ఇండియా తమకు హామీ ఇచ్చిందని US విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పారు. ‘రష్యా చమురుపై మరిన్ని ఆంక్షలు విధించాం. అదనపు రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపేస్తామని చర్చల సందర్భంగా భారత్ మాటిచ్చింది’ అని మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో అన్నారు. ఇండియా తమ ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప <<19115659>>ఇంకెవరూ చెప్పలేదని<<>> రష్యా విమర్శించడం తెలిసిందే.
News February 15, 2026
చల్లని నీరు Vs వేడి నీరు.. స్నానానికి ఏది బెటర్!

స్నానానికి వేడి నీరు బెటరా? చల్లని నీరు మేలా? అంటే రెండూ మంచివేనంటున్నారు నిపుణులు. చల్లటి నీటితో ఇమ్యూనిటీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయని, రక్తప్రసరణ మెరుగవుతుందని అంటున్నారు. వేడి నీళ్లతో కండరాలు రిలాక్స్ అవుతాయని, ఒత్తిడి తగ్గుతుందని పేర్కొంటున్నారు. నిద్ర ఇంప్రూవ్ అవుతుందని చెబుతున్నారు. మొత్తంగా ఉదయం చల్లటి నీళ్లు, రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు.


