News September 17, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,53,203 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.78,346, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,200, అన్నదానం రూ.24,657,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
Similar News
News October 14, 2024
ఉజ్బెకిస్థాన్‌లో హుజురాబాద్ అధ్యాపకుడి ప్రసంగం
ఉజ్బెకిస్థాన్ దేశంలోని తాష్కెంట్ అల్ఫ్రాగానస్ యూనివర్సిటీలో శనివారం జరిగిన యునెస్కో ఆసియా పసిఫిక్ వ్యవస్థాపక విద్యాసదస్సులో హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డా.మల్లారెడ్డి భారతదేశం తరఫున పాల్గొని ప్రసంగించారు. 21వ శతాబ్దంలో యువత ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను అధిగమించే విద్యావిధానాల గురించి వివరించారు. కార్యక్రమంలో 40 దేశాల నుంచి 200 ప్రతినిధులు పాల్గొన్నారు.
News October 13, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP న్యూస్
@ ఓదెల మండలంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి.
@ రామాజీపేటలో దాడికి పాల్పడిన ఎనిమిది మందిపై కేసు.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ మెట్‌పల్లిలో ఘనంగా బతుకమ్మల నిమజ్జనం.
@ జగిత్యాలలోని టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో జెర్రీ.
@ మంథనిలో తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తికి గాయాలు.
@ కాటారం మండలం విలాసాగర్‌లో సీసీ కెమెరాల ప్రారంభం.
News October 13, 2024
వేములవాడలో రేపు మంత్రి కొండా సురేఖ పర్యటన ఇలా..
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రేపు (సోమవారం) రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకోనున్నారు. ఆలయంలో పూజల అనంతరం బద్ది పోచమ్మను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజ రాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నారు.