News January 28, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.97,772 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.49,214ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,950, అన్నదానం రూ.10,608,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

Similar News

News February 14, 2025

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు పబ్లిక్ థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

News February 14, 2025

సంగం: లోన్ల కోసం 15వేల దరఖాస్తులు

image

కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

News February 14, 2025

VZM: గ్రూప్-2 పరీక్షకు 12 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

image

APPSC ఆధ్వ‌ర్యంలో ఈ నెల 23న గ్రూప్‌-2 మెయిన్స్ ప‌రీక్ష‌లు జరగనున్నాయి. విజ‌య‌న‌గ‌రంలో మొత్తం 12 ప‌రీక్షా కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశామని జేసీ సేతు మాధవన్ తెలిపారు. ఆ రోజు ఉద‌యం 10 నుంచి 12.30 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి 5.30 వ‌ర‌కు ప‌రీక్షలు జ‌రుగుతాయి. ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద 144 సెక్ష‌న్ ఏర్పాటు చేయాల‌ని, ప‌టిష్ఠమైన పోలీసు బందోబ‌స్తు నిర్వ‌హించాల‌ని జేసీ అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!