News March 23, 2025

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆదాయం రూ.98,26,635

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి 13 రోజులకు సంబంధించిన ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా.. టికెట్ల ద్వారా రూ.26,54,646, ప్రసాదాల ద్వారా రూ.26,66,465, అన్నదాన విరాళ ద్వారా రూ.7,02,896, హుండీ ఆదాయం రూ.38,02,628 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Similar News

News April 22, 2025

భీమవరం లాడ్జిలో పోలీసుల తనిఖీలు

image

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ రెసిడెన్షియల్ & లాడ్జిపై టూ టౌన్ సీఐ కాళీ చరణ్ తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో 9మంది అమ్మాయిలు, 9మంది అబ్బాయిలు ఉన్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకుడు అంతం శ్రీను పరారైనట్లు స్థానికులు తెలిపారు.

News April 22, 2025

ఒంగోలు: ఆ విద్యార్థులకు నేడే చివరి గడువు

image

DELED 4వ సెమిస్టర్ విద్యార్థులు నేటి సాయంత్రంలోపు పరీక్ష ఫీజును చెల్లించాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి సాయంత్రం ఐదు గంటల లోపు రూ.250 పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. రూ.250ఫైన్‌తో ఈనెల 27వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.

News April 22, 2025

దొంగల కదలికల భయంతో నిద్రలేని గ్రామం

image

పెదనందిపాడు మండలానికి చెందిన పరిటలవారిపాలెం గ్రామంలో రెండు రోజులుగా దొంగల కదలికలతో గ్రామస్థులు భయంతో గడుపుతున్నారు. రాత్రివేళల్లో ఇంట్లోకి చొరబడి దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి గ్రామస్థులు కర్రలు పట్టుకుని రాత్రి వేళ కాపలా కాశారు. పోలీసుల గ్రామానికి భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు.

error: Content is protected !!