News August 21, 2025

ధర్మవరంలో వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. పట్టణంలోని సిద్దార్థ థియేటర్ సమీపంలో గుర్తు తెలియని (35) వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు కత్తులు, కొడవళ్లు, రాళ్లతో దాడులు చేయడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 23, 2026

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు: ఎస్పీ

image

వాహనదారులకు ఎస్పీ జగదీశ్ పలు సూచనలు చేశారు. అనంతపురంలోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. దీనివల్ల సాటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే భారీ జరిమానాలు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News January 23, 2026

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా TN అసెంబ్లీలో తీర్మానం

image

జీ రామ్ జీ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసిన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం స్టాలిన్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తీసేసి జీ రామ్ జీగా మార్చడాన్ని DMK వ్యతిరేకిస్తూ వస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే పంజాబ్, TG ప్రభుత్వాలు ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.

News January 23, 2026

ఇద్దరు హంతకులు.. జైలులో ప్రేమ.. పెరోల్‌తో పెళ్లి!

image

ఇద్దరు హంతకుల మధ్య జైలులో చిగురించిన ప్రేమ పెరోల్‌తో పెళ్లి పీటలెక్కింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడి హత్య కేసులో ప్రియా సేథ్ జీవిత ఖైదు అనుభవిస్తోంది. ప్రియురాలి భర్త, ఆమె ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తిని చంపిన కేసులో హనుమాన్ ప్రసాద్ జైలులో ఉన్నాడు. ప్రియ, ప్రసాద్ మధ్య సంగనేర్‌(RJ) ఓపెన్ జైలులో ప్రేమ చిగురించింది. వీరికి 15రోజుల అత్యవసర పెరోల్‌ను RJ హైకోర్టు మంజూరు చేసింది. నేడు వీరి వివాహం.