News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.
Similar News
News January 21, 2026
మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.
News January 20, 2026
మన్యం కొండ బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ ఏర్పాట్లు

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి మార్చి 5 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. లక్షలాది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రథోత్సవం శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
News January 20, 2026
MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


