News August 14, 2025

ధర్మారం: నంది పంప్ హౌస్‌లో ఎత్తిపోతలు షురూ

image

ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్‌లో గోదావరి జలాల ఎత్తిపోతల ప్రక్రియ ప్రారంభమైంది. కాళేశ్వరం నుంచి ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కుల నీరు నంది రిజర్వాయర్‌లోకి తరలివెళ్తోంది. అక్కడి బాహుబలి మోటార్లలో 3 మోటార్లు నడిపి నంది రిజర్వాయర్‌కు 9,450 క్యూసెక్కుల నీటిని తరలించారు. కాగా ఇక్కడి జలాలను రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్ హౌస్‌కు జలాలు తరలివెళ్తున్నాయి.

Similar News

News March 13, 2026

నకిలీ బ్రాండ్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి: JC

image

మార్కెట్లో సురక్షితమైన ఉత్పత్తులనే వినియోగదారులు వినియోగించాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వినియోగ దారుల సంఘ సమాఖ్య నిర్వాహక కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వినియోగదారులకు చైతన్యం కలిగించే విధంగా రూపొందించిన వాల్ పోస్టర్లను నంద్యాలలో శుక్రవారం జేసీ విడుదల చేశారు. నకిలీ బ్రాండ్ల పట్ల వినియోగదారుల అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 13, 2026

గద్వాల: రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

image

జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వివాహ వేడుకకు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన హాజరవుతారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క కూడా పాల్గొనే అవకాశం ఉంది.

News March 13, 2026

జీడిపప్పు, కోకో, కొబ్బరి పంటల అభివృద్ధికి రూ.708 కోట్లు

image

రాష్ట్రంలో తోట పంటలైన కొబ్బరి, జీడి, కోకో పంటలకు కేంద్రం రూ.708 కోట్లు అందించిందని కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి భగీరథ చౌదరి వెల్లడించారు. ఈ పంటలకు సంబంధించి శుక్రవారం రాజ్యసభలో ఎంపీ సానా సతీష్ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. 2.01 లక్షల హెక్టార్లలో జీడిపప్పు, 1.08 లక్షల హెక్టార్లలో కొబ్బరి, 47 వేల హెక్టార్లలో కోకో రాష్ట్రంలో సాగులో ఉందని మంత్రి వివరణ ఇచ్చారు.