News May 7, 2025

ధాన్యం ఎప్పటికప్పుడు తూకం వేయాలి: సిరిసిల్ల కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ధాన్యం తరలించడానికి అందుబాటులో సరిపడా వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందకుండా అధికారులు, నిర్వాహకుల సూచనలు పాటించాలని ఆయన కోరారు.

Similar News

News February 12, 2026

VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

image

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.

News February 12, 2026

VZM: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

image

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.

News February 12, 2026

విశాఖ: ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

image

కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని CM వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.