News November 30, 2025
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థంవంతంగా నడుస్తున్నాయి’

ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థంవంతంగా నడుస్తున్నాయని బాపట్ల సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట ఆదివారం చెప్పారు. జిల్లాలో 167 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 488 మంది రైతులకు స్లాట్‌లు ఇచ్చామన్నారు. ప్రస్తుతం 58 కేంద్రాలలో 2,922 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వివరించారు. 598 వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Similar News
News February 12, 2026
కాకినాడ పోలీస్ శాఖకు ‘సీ పోర్ట్స్’ గిఫ్ట్.. రూ.12 లక్షల వాహనం బహూకరణ

కాకినాడ ‘సీ పోర్ట్స్’ లిమిటెడ్ (SPL) కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా జిల్లా పోలీస్ శాఖకు రూ.12 లక్షల విలువైన మహీంద్రా బొలెరో వాహనాన్ని బహూకరించింది. బుధవారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ బిందు మాధవ్ వాహన తాళాలను అందుకుని, జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ యంత్రాంగానికి అండగా నిలిచిన సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.
News February 12, 2026
తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.
News February 12, 2026
పెద్దపల్లి : ఓటింగ్‌లో మగువలే మేటి!

పెద్దపల్లి జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 1,28,023 మంది మహిళా ఓటర్లకు గానూ 91,873 మంది పోలింగ్‌లో పాల్గొనడంతో 71.76 శాతం పోలింగ్ నమోదైంది. రామగుండంలో 62,868, పెద్దపల్లిలో 16,319, సుల్తానాబాద్‌లో 7,023, మంథనిలో 5,663 మంది మహిళలు ఓటు వేశారు. ప్రజాస్వామ్య పండుగలో మహిళా లోకం చైతన్యం చూపిస్తూ పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం విశేషం.


